CITU మహాసభలకు నూజివీడు సిద్ధం

ELR: నూజివీడు పట్టణంలోని పీవీఎస్ ఆర్ కళ్యాణ మండపంలో ఈనెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సీపీయం అనుబంధ సీఐటీయూ ఏలూరు జిల్లా 13వ మహాసభలు నిర్వహించనున్నట్లు సీఐటీయూ నేత జి రాజు తెలిపారు. అందుకోసం నూజివీడు పట్టణంలో బుధవారం బ్యానర్లు, తోరణాలతో అలంకరిస్తూ, జిల్లా, రాష్ట్రస్థాయి నాయకులకు స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు.