చేప పిల్లలు వదిలిన మాజీ జెడ్పీటీసీ
SRD: కల్హేర్ మండలం కృష్ణాపూర్ గ్రామంలోని పెద్ద చెరువులో ఇవాళ ఉచిత చేప పిల్లలను మాజీ జెడ్పీటీసీ నరసింహారెడ్డి వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారులు కలిసికట్టుతో కష్టపడి, చేప పిల్లలను సంఘాల తరఫున సభ్యులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గంగమ్మ తల్లి ఆశీర్వాదంతో మత్స్య కార్మికుల ఆదాయం పెరగాలని ఆకాంక్షించారు.