VIDEO: చిన్నారిపై కోతుల దాడి

VIDEO: చిన్నారిపై కోతుల దాడి

మెదక్ పట్టణంలోని చంద్రభవన్ కాలనీలో కోతులు బీభత్సం సృష్టించాయి. కాలనీకి చెందిన నవీన్ కుమార్తె 12 ఏళ్ల బాలిక కాలనీలో ఆడుకుంటుండగా రెండు కోతులు వెనుకగా వచ్చి దాడి చేశాయి. బాలికను ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. కోతుల ఇబ్బందులపై కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఆరోపించారు.