తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం
TG: తెలంగాణలో సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగాలని కోరుకున్నట్లు తెలిపారు.