అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్
HNK: నగరంలోని వడ్డేపల్లి బండ్‌లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ చాహత్ బాచ్ పాయ్ ఈరోజు పరిశీలించారు. ఈట్ స్ట్రీట్ నిర్మాణం టెండర్ పూర్తవడంతో ఆమె పనులను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రీనరీ, మ్యూజికల్ ఫౌంటెన్ ఏర్పాట్లు, వర్షాకాలం రానున్న నేపథ్యంలో ముంపు నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.