కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

HYD: లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అడ్డగుట్టలోని వడ్డెర బస్తీకి చెందిన శ్రీనివాస్(29) భార్యభర్తలు తరచూ మనస్పర్ధలతో గొడవ పడుతూ ఉండేవారు. అతని భార్య పుట్టింటికి వెళ్లడంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాస్ ఆదివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.