మానవ అక్రమ రవాణా వ్యతిరేక అవగాహన సదస్సు

SRD: మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాడాలని స్కోప్ సంస్థ అధ్యక్షులు డాక్టర్ బండి సాయన్న తెలిపారు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలలో విడివిడిగా బాలల అక్రమ రవాణా సదస్సులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. బాలల అక్రమ రవాణా నివారించాలంటే నేరస్తులపై కఠినంగా శిక్షలు ఉండాలని స్కోప్ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ బండి సాయన్న సూచించారు.