'బృందావన పురం గ్రామంలో మంచినీటి సమస్యను తీర్చాలి'

SRPT: నడిగూడెం మండలం బృందావన పురం గ్రామంలో మంచినీళ్ల సమస్యను పరిష్కరించాలని నడిగూడెం మండల సీపీఎం పార్టీ కార్యదర్శి సత్యనారాయణ అన్నారు. శనివారం సీపీఎం పార్టీ ప్రజా పోరుబాట సర్వేలో భాగంగా బృందావనపురం గ్రామంలో సర్వే నిర్వహించి మంచినీటి సమస్త ఉన్నట్లు స్థానిక మహిళలు తెలిపారని ఆయన తెలియజేశారు. వెంటనే ఎమ్మెల్యే స్పందించి మంచినీటి సమస్యను తీర్చాలన్నారు.