నేడు టీమిండియా VS దక్షిణాఫ్రికా

నేడు టీమిండియా VS దక్షిణాఫ్రికా

శ్రీలంకలో జరుగుతున్న మహిళల ట్రై-నేషన్ సిరీస్‌లో భాగంగా ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో భారత మహిళల జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఫైనల్ బెర్త్ కోసం భారత్ విజయంపై కన్నేయగా, పాయింట్ల ఖాతా తెరవాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా జరగనుంది.