శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు
HYD: ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీ, శ్రీ శివాలయం ప్రాంగణంలో గల శ్రీ త్రిశక్తి ఆలయంలో, ఈ రోజు, శ్రీ దేవి శరన్నవరాత్రుల ప్రారంభం సందర్బంగా, ఆలయ అర్చకులు మధుసూదన శర్మ శ్రీ అమ్మవార్లకు అభిషేకం చేసి, పసుపు రంగు చీరతో శ్రీ త్రిశక్తి దేవిగా అలంకరించి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు, భక్తి శ్రద్ధలతో సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు.