'విద్యార్థులు క్రమశిక్షణతో లక్ష్యాలను చేరుకోవాలి'
MDK: విద్యార్థులు బాల్యం నుంచే క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సూచించారు. శనివారం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నార్సింగి మున్సిపాలిటీలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో పలు అభివృద్ధి పనులను కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. రూ. 10 లక్షల నిధులతో పింక్ టాయిలెట్స్ ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.