ఎగ్ కార్ట్‌ల పంపిణీ చేసిన ఎర్రబెల్లి
JN: పాలకుర్తి మండల కేంద్రంలో స్వయం ఉపాధి లక్ష్యంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్ఈసీసీ సహకారంతో ఆదివారం ఎగ్ కార్ట్‌లను పంపిణీ చేశారు. నియోజకవర్గం మొత్తంగా 110 ఎగ్ కార్ట్‌లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కోడిగుడ్డు పోషక విలువలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.