హర్మూజ్‌లో మైన్ల వేట.. రంగంలోకి యూకే నేవీ
ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేసి ఆ ప్రాంతంలో భారీగా సముద్రపు మైన్లను ఏర్పాటు చేసింది. అమెరికా యుద్ధం నుంచి వెనుదిరిగితే తప్ప జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. దీంతో అమెరికా.. UK సహాయం కోరింది. ఈ క్రమంలో సముద్ర గర్భంలోని మైన్లను గుర్తించి పేల్చివేయడానికి యూకే తన రాయల్ నేవీ నౌకల్లో అండర్ వాటర్ డ్రోన్లను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.