బాల్య వివాహాల నిర్మూలన మనందరి బాధ్యత
SKLM: బాల్య వివాహాల నిర్మూలన మనందరి బాధ్యతని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సంబంధిత వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. బాల్య వివాహాల రహిత భారత దేశంగా ముందుకు నడిపించేందుకు అందరి వంతు కృషి అవసరం అన్నారు. బాల్యవివాహాల వలన ఎన్నో అనర్థాలు కలుగుతున్నాయని అన్నారు.