సమ్మెలో పాల్గొన్న RTC కార్మికులపై కేసు నమోదు

సమ్మెలో పాల్గొన్న RTC కార్మికులపై కేసు నమోదు

మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తంగా కొనసాగుతోంది. డిపో వద్ద భారీ పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. విధులకు రాని 20 మంది కార్మికులపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇవాళ ఉదయం సమ్మెలో పాల్గొన్న వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. సమ్మెకు వస్తున్న ఉద్యోగులను ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.