యూరియా కొరతతో అన్నదాత అవస్థలు

యూరియా కొరతతో అన్నదాత అవస్థలు

ASR: చింతూరు మండలాల్లో వరి సాగు చేస్తున్న రైతులకు యూరియా కొరత ఏర్పడడంతో విలవిలాడుతున్నారు. యూరియా సరైన సమయంలో అందకపోవడం వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎకరాకు కనీసం ఒక యూరియా బస్తా వేయాల్సి ఉంటుంది. కానీ 10 ఎకరాలు ఉన్న రైతుకు కూడా కేవలం ఒక్క ఎకరానికి సరిపోయేటట్టుగా ఒకేఒక బ్యాగు ఇవ్వడంతో రైతులు ఏంచేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.