టాపర్లకు ప్రశంసా పత్రాలు

టాపర్లకు ప్రశంసా పత్రాలు

GDWL: జిల్లాలో ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యేలు విజయుడు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ చేతుల మీదుగా టాపర్‌లను సత్కరించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించి జిల్లా గౌరవాన్ని పెంచాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో అధికారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.