మోదీ తల్లి పాత్రలో బాలీవుడ్ నటి!
ప్రధాని మోదీ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'మా వందే'. ఈ చిత్రాన్ని దర్శకుడు క్రాంతికుమార్ సీహెచ్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో మోదీ పాత్రలో ఉన్ని ముకుందన్ నటిస్తున్నాడు. కాగా, ఈ చిత్రంలో మోదీ తల్లి పాత్రలో బాలీవుడ్ నటి రవీణా టండన్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ సంస్థ తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు పలు భాషలలో నిర్మిస్తోంది.