జాతీయ లోక్ అదాలత్ వాయిదా

PPM: ఈ నెల 10వ తేదిన జరగాల్సిన జాతీయ లోక్ అదాలత్ వాయిదా పడిందని రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్.దామోదరరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.హైకోర్టు ఆదేశాల మేరకు వాయిదా వేశామన్నారు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జులై 5వ తేదీన నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. లోక్ అదాలత్ ద్వారా ప్రజలు పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవాలన్నారు.