'మహిళల అభివృద్ధితోనే రాష్ట్రం, దేశం అభివృద్ధి'
VZM: మహిళలు బలంగా ఉంటేనే కుటుంబం, జిల్లా, రాష్ట్రం మరియు దేశం బలంగా ఉంటాయని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి కుటుంబానికి ఒక ఇంటర్ప్రెన్యూర్ తయారు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.