17న ప్రధాని మోదీ తల్లికి పిండ ప్రదానం

17న ప్రధాని మోదీ తల్లికి పిండ ప్రదానం

బీహార్‌లోని గయలో జరుగుతున్న పితృపక్ష మేళాకు ప్రధాని మోదీ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 17న మోదీ గయ చేరుకుని.. తన తల్లికి పిండ ప్రదానం చేయనున్నారు. అలాగే, తన పూర్వీకులకు తర్పణాలు అర్పించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పూర్ణియా ఎయిర్‌పోర్టును, పాట్నా మెట్రోను ప్రారంభించనున్నట్లు సమాచారం. మరోవైపు పితృపక్ష మేళాకు పోలీసు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.