కార్వాన్: కమిషనర్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లిన ఎమ్మెల్యే

HYD: కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహియుద్దీన్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీకర్ణన్ని మంగళవారం కలిశారు. నియోజకవర్గ పరిధిలోని సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా వీధిలైట్ల సమస్యలు ఉన్నాయని, అలాగే బల్కాపూర్ నాలా డీసీల్టింగ్ పనులు చేపట్టాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మంజూరు చేసి లబ్ధిదారులకు అందజేయాలని వినతిపత్రం ఇచ్చారు.