కనకమహాలక్ష్మీ అమ్మవారి హుండీల లెక్కింపు
VSP: బురుజుపేటలోని శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థాన హుండీలను సోమవారం లెక్కించారు. 40 రోజులలో నగదు రూ. 67,78,784తో పాటు బంగారం 47.500 గ్రాములు, వెండి 669 గ్రాములు, విదేశీ కరెన్సీ లభించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు, బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.