'వన్యప్రాణులను కాపాడండి'
BHNG: భువనగిరి సమీపంలోని వరంగల్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై చనిపోయిన కొండచిలువ పిల్ల లభించింది. రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొనడం వల్ల ఇది జరిగి ఉంటుందని అటవీ అధికారులు భావిస్తున్నారు. ఇటీవల ఇదే రోడ్డుపై అరుదైన పునుగు పిల్లి కళేబరం దొరికింది. వన్యప్రాణుల రక్షణకు అటవీ శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.