VIDEO: అంజని రిజర్వ్ ఫారెస్ట్‌లో భారీ అగ్ని ప్రమాదం
NRML: నర్సాపూర్(G) మండలం అంజని రిజర్వ్ ఫారెస్ట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కనున్న గుట్టపై మంటలు చెలరేగి అటవీ సంపద బూడిదైంది. ఎండుటాకుల వల్ల మంటలు వేగంగా వ్యాపిస్తూ వనమూలికలు, జీవవైవిధ్యాన్ని దెబ్బతీశాయి. దట్టమైన పొగ కారణంగా ప్రధాన రహదారిపై వాహనదారులకు దారి కనిపించకపోవడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డారు.