విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

NGKL: విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు. ఇవాళ కల్వకుర్తి పట్టణంలోని జేపీ నగర్‌లో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల భోజనశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆహారం రుచి, నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు.