ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన డీఎస్పీ
NRPT: నారాయణపేటలోని తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డీఎస్పీ లింగయ్య ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వాటితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు అందించిన ఫిర్యాదులను పరిశీలించి చట్టం మేరకు పరిష్కరిస్తామని అన్నారు.