కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ప్రభుత్వ విప్ ప్రచారం
MHBD: కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA డా. రాంచందర్ నాయక్ అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా శుక్రవారం ఉదయం కురవి మండలం బిబినాయక్ తండాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం ఆయన గ్రామంలో ఓట్లు అభ్యర్థించారు.