రాత్రికి భారత్‌ను వీడనున్న బూడిద మేఘం
ఇథియోపియాలోని హేలీ గుబ్బి అగ్నిపర్వతం పేలడంతో ఏర్పడిన బూడిద మేఘం భారత్ దిశగా కదులుతున్న విషయం తెలిసిందే. గంటకు 120 కి.మీ వేగంతో దూసుకొస్తున్న ఈ మేఘం రాత్రి 7.30 గంటలకు భారత్‌ను వీడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేఘం ప్రభావం హర్యానా, గుజరాత్, పంజాబ్, యూపీ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలపై ఉంటుందని తెలిపింది.