అగ్నిప్రమాద బాధితురాలికి ఎమ్మెల్యే సాయం

ELR: జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెనికి చెందిన మడివి రాజేశ్వరమ్మ ఇల్లు ఇటీవల అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఆమెకు రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగానూ ఆదుకుంటానని, అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.