జిల్లా జైలును సందర్శించిన మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్

NLG: నల్గొండ జిల్లా జైలులో ఖైదీలకు అన్ని వసతులతో పాటు, జైలు పరిశుభ్రంగా ఉందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీం అక్తర్ తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం అయన నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా జైలును సందర్శించారు. జైలులోని అన్ని బ్యారక్స్‌ను, వంటగదిని, ఖైదీలకు పెట్టే ఆహార పదార్థాలను, భోజనాన్ని అన్నిటిని పరిశీలించారు.