కంటి వైద్య శిబిరం నిర్వహణ అభినందనీయం

KDP: ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహణ అభినందనీయమని పులివెందుల మానవత సంస్థ ఛైర్మన్ కొండారెడ్డి అన్నారు. ఇందులో భాగంగా మొయిల్లచెరువు గ్రామానికి చెందిన కంభం తిరుమల రెడ్డి మూడేళ్లుగా పులివెందులలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. కాగా, మానవత సంస్థ సభ్యులు ఆదివారం వైద్య శిబిరాన్ని సందర్శించారు. అనంతరం తిరుమలరెడ్డిని సన్మానించి ఆయన సేవలను కొనియాడారు.