పాఠశాల విద్యార్థులకు కళ్లద్దాల పంపిణీ
KMR: గాంధారి కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినులకు ఆర్‌బీఎస్‌కే వైద్య బృందం ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు. మొత్తం 263 మంది విద్యార్థులను పరీక్షించినట్లు ప్రత్యేక అధికారిణి శిల్ప తెలిపారు. వీరిలో 21 మందికి కళ్లద్దాల అవసరం ఉన్నట్లు గుర్తించి, 19 మందికి కళ్లద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మమ్మాయి రేణుకా యాదవ్, వైద్యులు ఇస్నత్ అలీ ఉన్నారు.