కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
MHBD: నెల్లికుదురు మండలానికి చెందిన లబ్ధిదారులకు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ 56 కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల కళ్యాణానికి ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయనన్నారు.