గల్ఫ్ దేశాలపై కొనసాగుతున్న ఇరాన్ దాడులు
గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సౌదీ అరేబియాపై డ్రోన్లతో దాడి చేసింది. రియాద్‌లోని అమెరికా ఎంబసీపై రెండు డ్రోన్లతో టెహ్రాన్ విరుచుకుపడింది. దీంతో ఎంబసీలో మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. తమ దేశ సుప్రీం లీడర్‌ను అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా హతం చేసిన నేపథ్యంలో ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.