రామలింగేశ్వర స్వామికి విశేష రుద్రాభిషేకం

రామలింగేశ్వర స్వామికి విశేష రుద్రాభిషేకం

KRNL: మంత్రాలయంలో కొలువైన రామలింగేశ్వర స్వామికి పూజారులు విశేష రుద్రాభిషేకం నిర్వహించారు. సోమవారం నిర్మాల్యం, పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం నిర్వహించి, విశేషంగా అలంకరించి మంగళహారతులు ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయం చేరుకొని రామలింగేశ్వర స్వామికి మొక్కులు తీర్చుకున్నారు. పూజారులు భక్తులకు ఫలమంత్ర అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు.