ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి
నంద్యాల: ప్రజల సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వినతులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను రాష్ట్ర మంత్రి ఫారుక్ ఆదేశించారు. మంగళవారం రాత్రి మంత్రి క్యాంపు కార్యాలయంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి పలు అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.