రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ ప్రజాదర్బార్
అన్నమయ్య: రాజంపేట నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు ప్రజాదర్బార్ నిర్వహించారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు. తాగునీటి ఇబ్బందులు వంటి పలు అంశాలపై వినతులు అందినట్లు ఆయన తెలిపారు.