మిలాన్-2026.. ‘రికార్డు స్థాయిలో 74 దేశాల భాగస్వామ్యం’
విశాఖలో భారత నౌకాదళం నిర్వహిస్తున్న 'మిలాన్-2026' విన్యాసాలు చరిత్రలోనే అతిపెద్దవిగా నిలిచాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఈ విన్యాసాల్లో 74 దేశాలు పాల్గొనడం విశేషమని చెప్పారు. అంతర్జాతీయ సముద్ర సమాజం భారతదేశాన్ని బాధ్యతాయుతమైన, విశ్వసనీయ భాగస్వామిగా గుర్తిస్తోందని, ఈ భాగస్వామ్యం ఆ నమ్మకానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.