రేపు జీఎంసీ పాలకవర్గ అత్యవసర సమావేశం
GNTR: జీఎంసీ పాలకవర్గం అత్యవసర సమావేశం శుక్రవారం కౌన్సిల్ హాల్లో జరుగుతుందని మేయర్ రవీంద్ర తెలిపారు. సమావేశంలో జీఎంసీ సమీపంలోని 11 గ్రామ పంచాయతీలను విలీనం చేసే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపేందుకు తీర్మానంపై చర్చించనున్నారు. అలాగే ప్రభుత్వ స్థలాల్లో దీర్ఘకాలికంగా నివాసాలు ఉంటున్న ప్రగతినగర్, యానాదికాలనీలను క్రమబద్ధీకరించేందుకు నిర్ణయం తీసుకోనున్నారు.