'అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తి చేయాలి'
E.G: నియోజకవర్గంలో జరుగుతున్న కోట్లాది రూపాయల అభివృద్ధి పనులను అధికారులు నిరంతరం తనిఖీ చేసి నాణ్యతతో పూర్తి చేయాలని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సూచించారు. రూరల్, కడియం మండలాల్లో రోడ్లు, డ్రైనేజీ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో పన్నుల బకాయిలను త్వరగా వసూలు చేసి, వేసవిలో నీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.