సర్పంచ్ ఎన్నికలు.. 9 ఓట్ల తేడాతో విజయం
ADB: జైనథ్ మండలంలోని కోర గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అడ్డ వెంకట్ రెడ్డి కేవలం 9 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ పోటీలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఎనుగు రాకేష్ రెడ్డి పరాజయం పాలయ్యారు. ఫలితాలు వెలువడిన అనంతరం గ్రామంలో ఉత్సాహ వాతావరణం నెలకొంది.