'రేషన్ కార్డుదారులకు E-KYC తప్పనిసరి'

KDP: సిద్దవటం మండలంలోని రేషన్ కార్డు కలిగి ఉన్నవారు EKYC తప్పనిసరిగా చేయించుకోవాలని ఇంచార్జ్ తహసీల్దార్ మాధవిలత తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. రేషన్ కార్డులో EKYC చేయించుకోని వారు సమీపంలోని చౌక దుకాణం వద్దకు వెళ్లి మార్చి 30 తేదీ లోపల చేయించుకోవాలన్నారు. రేషన్ కార్డులను డిజిటలైజ్ చేస్తున్నందున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా EKYC చేయించుకోవాలని ఆమె సూచించారు.