'సమాజ నిర్మాణంలో గురువులే మార్గదర్శకులు'

సంగారెడ్డి: సమాజ నిర్మాణంలో గురువులే మార్గదర్శకులని మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. చౌటకూరు మండలం సంగుపేటలో ఆందోల్ నియోజకవర్గ విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ఎంతగానో ప్రాధాన్యతమిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నియోజకవర్గాన్ని విద్య, వైజ్ఞానిక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.