గణేష్ మండపాన్ని సందర్శించిన డీఎస్పీ

ప్రకాశం: కనిగిరి జవహర్‌లాల్ వీధిలో ఉన్న హనుమాన్ భజం సంఘం దగ్గర ఉన్న వినాయక స్వామిని డీఎస్పీ సాయి యశ్వంత్ ఈశ్వర్ దర్శించుకున్నారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు డీఎస్పీ , సీఐ, ఎస్సై లను ఘనంగా సన్మానించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనంకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.