విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డ్స్ పంపిణీ
MDK: 2025-26 విద్యా సంవత్సరం ముగింపు సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులకు ప్రగతి నివేదికలు పంపిణీ చేశారు. నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో ఉపాధ్యా యులు మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో సమయాన్ని వృథా చేయకుండా నైపుణ్యాల పెంపుపై దృష్టి సారించాలని సూచించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున పిల్లలు బయట తిరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులను కోరారు.