ఆర్టీసీ బస్సుకి తప్పిన పెను ప్రమాదం

ఆర్టీసీ బస్సుకి తప్పిన పెను ప్రమాదం

NLR: ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. సోమశిల - నెల్లూరు రహదారిలో సోమశిల సమీపంలోని ఆశ్రమం వద్ద ఉన్న బ్రిడ్జిపై రంధ్రం పడడంతో రాకపోకలకు నిలిపివేసి మలుపులో తాత్కాలిక రహదారిని ఏర్పాటు చేసి రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఇవాళ మలుపు వద్ద ఆత్మకూరు డిపోకు చెందిన బస్సు పొరపాటున రోడ్డు దాటి దిగువకు జారిపోయింది. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.