వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

NZB: కోటగిరి మండలానికి చెందిన గోపి సాయిలు (30) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై సునీల్ తెలిపారు. ఆర్మూర్‌లో భార్యతో కలిసి ఉంటున్న సాయిలు, ఈ నెల 12న కోటగిరికి వచ్చి తిరిగి వెళ్తూ అదృశ్యమయ్యాడు. రాత్రి 8 గంటలకు బయలుదేరిన అతను ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన తల్లి అనూష పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.