ఇంటింటా అన్నదాత సుఖీభవ: ఎమ్మెల్యే
కోనసీమ: అమలాపురం మండలం బండారులంకలో 'అన్నదాత సుఖీభవ' ఇంటింటి ప్రచార కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో AMUDA ఛైర్మన్ అల్లాడ స్వామినాయుడు, అమలాపురం మార్కెట్ కమిటీ ఛైర్మన్ అధికారి జయవెంకటలక్ష్మీ, బొర్రా ఈశ్వరరావు పాల్గొన్నారు.