సెల్ టవర్ బ్యాటరీల చోరీ ముఠా అరెస్ట్
WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెల్ టవర్ల బ్యాటరీలను చోరీ చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను శుక్రవారం హసన్‌పర్తి పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు నిందితులు పట్టుబడగా, ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.1.98 లక్షల విలువైన 144 బ్యాటరీలు, రూ.2.60 లక్షల నగదు, రెండు ట్రాలీలు, రెండుబైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.